అక్కకి న్యాయం జరగలేదని చెల్లెలు సూసైడ్ ..రాజస్తాన్‌‌లో ఘోరం 

అక్కకి న్యాయం జరగలేదని చెల్లెలు సూసైడ్ ..రాజస్తాన్‌‌లో ఘోరం 

జోధ్​పూర్: అక్కకు జరిగిన అన్యాయంపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో చెల్లెలు ఆత్మహత్య చేసుకుంది. రాజస్తాన్‌‌లోని జోధ్​పూర్‌‌‌‌లో ఈ విషాదం చోటుచేసుకుంది. జోధ్​పూర్ ఈ -మిత్ర సేవా కేంద్రం నిర్వాహకుడు మహిపాల్.. ఓ  యువతికి సంబంధించిన అభ్యంతరకరమైన వీడియోలను రికార్డ్ చేశాడు. వాటిని చూపించి మహిపాల్‌‌తో పాటు శివరాజ్, గోపాల్, విజారామ్, దినేశ్‌‌, మనోజ్, పుఖ్‌‌రాజ్ సహా మొత్తం 8 మంది గత నాలుగేండ్లుగా యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 

ఆమె నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు కూడా వసూలు చేశారు. ఈ వేధింపులను భరించలేక ఆ యువతి గత మార్చి 20న ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై యువతి చెల్లెలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి నెల రోజులు గడిచినా నిందితులపై పోలీసులు చర్యలు తీసుకోలేదు. దీంతో శుక్రవారం ఆ యువతి వాటర్ ట్యాంక్ ఎక్కి విషం తాగింది. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందింది.